కార్తీక మాసం రెండవ సోమవారం సందర్భంగా ముక్కంటి ఆలయానికి పోటెత్తిన భక్తులు
కార్తీక సోమవారం.. శ్రీకాళహస్తికి పోటెత్తిన భక్తజనం శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో కార్తీక సోమవారం సందర్భంగా భక్తుల రద్దీ నెలకొంది. ఆలయ పరిసర ప్రాంతాలు శివనామస్మరణలతో మారుమోగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. శివ కేశవులకు ప్రీతికరమైన కార్తీక మాసంలో శ్రీకాళహస్తికి విచ్చేసి దీపాలు వెలిగించడం ఆనందంగా ఉందని భక్తులు వెల్లడించారు. అధికారులు భక్తులకు తగిన ఏర్పాట్లు చేశారు.