మౌలిక వసతులు కల్పించకుంటే మున్సిపల్ కార్యాలయంలో నిద్రిస్తాం:వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ #localissue
పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని జగనన్న కాలనీలో మౌలిక వసతుల కల్పించకుంటే మున్సిపల్ కార్యాలయంలో నిద్రిస్తామని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ పేర్కొన్నారు. బుధవారం బ్రాహ్మణపల్లి జగనన్న కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా ఇక్కడ నిరుపేదల నివాసం ఉంటున్నా కనీసం తాగునీరు ,వీధిలైట్లు లేక అవస్థలు పడుతున్నారన్నారు.ఇదే విషయమై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువచ్చిన కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు.