మంచిర్యాల: రైతులకు అవసరమైన యూరియాను అందించాలని డిమాండ్ చేస్తూ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో
రైతాంగానికి యూరియా అందించాలని డిమాండ్ చేస్తూ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట పట్టణంలోని ఉత్కురు చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై సోమవారం మధ్యాహ్నం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు మాట్లాడుతూ యూరియా కొరతతో రైతాంగం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, ప్రభుత్వం తక్షణమే స్పందించి యూరియాను అందించాలనీ కోరారు. అనంతరం ఊట్కూర్ చౌరస్తా నుండి తాసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి తాసిల్దార్ దిలీప్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు.