కుప్పం: కుప్పంలో పరిశ్రమలు ఏర్పాటుకు సీఎం శంకుస్థాపన
కుప్పం నియోజకవర్గంలో ఏడు పరిశ్రమలు ఏర్పాటుకు సంబంధించి శనివారం సీఎం చంద్రబాబు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. సుమారు రూ.2200 కోట్ల పెట్టుబడితో 22 వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష పద్ధతిలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఏడు పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయని అన్నారు. దీనికి సంబంధించి శనివారం అమరావతి నుంచి సీఎం చంద్రబాబు నాయుడు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు.