గిద్దలూరు: గిద్దలూరు పట్టణంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ర్యాలీ నిర్వహించిన పోలీసులు
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో పోలీసులు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం సిఐలు రామకోటయ్య సురేష్ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రాచర్ల గేటు సెంటర్లో మానవహారం నిర్వహించి విద్యార్థులకు అమరవీరుల త్యాగ ఫలాలను వివరించి చెప్పారు. తర్వాత విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని విధి నిర్వహణలో ప్రాణాలను పెంచిన వారి త్యాగఫలాలను గుర్తుంచుకోవాలని విద్యార్థులకు సిఐలు సూచించారు.