తాడిపత్రి మండలం పరిధిలోని జీ వీ పీ కాలనీలో నివాసముండే సాయి సరళ (30) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాలు, అనారోగ్య సమస్యల వల్ల మనస్థాపం చెంది ఇంటిలో ఎవరు లేని సమయంలో ఫ్యాన్ కురివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ప్రాణం ఉందనే ఆశతో ఆస్పత్రికి తరలించారు. సాయి సరళ ను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.