అనంతపురం జిల్లా వ్యాప్తంగా జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాలతో వాహనాల తనిఖీలను శనివారం సాయంత్రం ముమ్మరంగా చేపట్టారు. ప్రధానంగా రోడ్డు సేఫ్టీ దిశగా అడుగులు వేస్తున్నట్లు జిల్లా ఎస్పీ తెలియజేశారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణమైన వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి రోడ్డు ప్రమాదాలు జరగకుండా పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.