మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని వైసీపీ కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పెద్దారవీడు వైసీపీ కన్వీనర్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పై టిడిపి నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ప్రజల సమస్యల గురించి మాట్లాడాలని ఎమ్మెల్యే పై అవాకులు చవాకులు పేలుస్తూ ఇష్టానుసారంగా మాట్లాడడం సరికాదని తెలిపారు. పశ్చిమ ప్రాంతంలో మార్కాపురం జిల్లా చేయడం వల్ల ఒరిగేది ఏమీ లేదని స్పష్టం చేశారు.