ముక్కంటిని దర్శించుకున్న అలనాటి సినీ తారలు రోజా, రవళి స్వాగతం పలికిన ఆలయ పిఆర్ఓ రవి
దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శనానికి బుధవారం ఉదయం దర్శించుకున్న అలనాటి సినీ తారలు రోజా రవళి వీరికి ఆలయ అధికారులు దక్షిణ గోపురం వద్ద ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు కల్పించారు అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల గర్భాలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం శ్రీ మేధా గురుదక్షిణామూర్తి సన్నిధి వద్ద శాలువాతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ మాజీ ధర్మకర్తల మండల అధ్యక్షులు అంజలి తారక శ్రీనివాసులు ఆలయ పిఆర్ఓ రవి ఆలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు