గంగాధర నెల్లూరు: శ్రీరంగరాజపురం మండలం తయ్యూరు పంచాయితీ పెద్దతయ్యూరు వర్షానికి కూలిన గుడిసె
శ్రీరంగరాజపురం మండలం తయ్యూరు పంచాయితీ పెద్దతయ్యూరు గ్రామానికి చెందిన విజయమ్మ పూరి గుడిసె గోడ భారీ వర్షానికి బుధవారం కూలిపోయింది. తనకున్న ఇద్దరు పిల్లలు కూడా వికలాంగులు కావడంతో ఆమె ఇబ్బందులు పడుతోంది. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటోంది. బాధిత కుటుంబానికి జీడీనెల్లూరు ఎమ్మెల్యే 50వేలు సాయం చేశారు.