భువనగిరి: భువనగిరి పట్టణములో భర్త ఇంటి ముందు ఆందోళన చేసిన భార్య
యాదాద్రి భువనగిరి జిల్లా: పెళ్లయిన కొద్ది రోజులకే భర్త వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపిస్తూ ఓ మహిళ భువనగిరిలోని తన భర్త ఇంటి ముందు నిరసనకు దిగింది. ఈ సందర్భంగా బుధవారం తెలిసిన వివరణ ప్రకారం హైదరాబాద్ దమ్మాయిగూడ కు చెందిన మమతకు భువనగిరికి చెందిన మణిదీప్ తో 2023లో వివాహమైంది. పెండ్లి అయినా పది రోజుల నుంచి భర్త తనను వేధింపులకు గురి చేస్తున్నాడని, తనకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేసింది. తన కుటుంబ సభ్యులతో కలిసి ఆమె భర్త ఇంటిముందు ఆందోళన వ్యక్తం చేసింది.