రంగారెడ్డి ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ నేతృత్వంలో ఏసీబీ అధికారులు కూకట్పల్లి సబ్ రిజిస్టార్ కార్యాలయంలో దాడులు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను ఆనంద్ కుమార్ వెల్లడించారు. సబ్ రిజిస్టర్ వేణుగోపాల్ రెడ్డి, సిబ్బంది, డాక్యుమెంట్ రైటర్లను విచారించారు. కార్యాలయానికి బయట ఉండకూడని డాక్యుమెంట్లు బయట వ్యక్తుల వద్ద లభించడంతో అధికారులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం అందరిని విచారిస్తున్నామని వెల్లడించారు. అవకతవకలు జరుగుతున్నాయని ఫిర్యాదు అందాయన్నారు.