పెదచెర్లోపల్లి: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రతి చిన్నారుల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని పెదచెర్లోపల్లి మండల ఎంపీపీ అత్యాల జపన్య కోరారు. శనివారం మండల పరిషత్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అదివారం మండలంలోని ప్రతి ప్రతి గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమం వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జరుగుతుందన్నారు.. పోలియో పై విజయం సాధించేందుకు రెండు పోలియో చుక్కలు చాలని , చిన్నారులకు పోలియో వ్యాధి రాకుండా తల్లిదండ్రులు బాధ్యత తీసుకొని వారికి పోలియో చుక్కలు వేయించాలని ఎంపీపీ సూచించారు.