పీలేరు మండలం పీలేరు పట్టణంలోని మోడల్ కాలనీలో స్క్రబ్ టైఫస్ వ్యాధితో ఒక మహిళ మృతి చెందింది.ఈ ఘటనతో తిరుపతి ఎస్.వి.ఆర్.ఆర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి / వైద్య కళాశాల నుంచి అంటువ్యాధుల పరిశీలనకు సంబంధించిన నిపుణుల బృందం పీలేరు మోడల్ కాలనీని సందర్శించింది.ఈ ప్రత్యేక వైద్య బృందంలో మైక్రోబయాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ విజయ కుమార్, ప్రివెంటివ్ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ హేమచంద్ర,చిన్నపిల్లల వ్యాధుల నిపుణులు డా. ప్రసాద్ రెడ్డి,ఫిజీషియన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.కృష్ణ కుమార్ తో పాటు జిల్లా వైద్య&ఆరోగ్య శాఖాధికారి డా.లక్ష్మీ నరసయ్య,తదితర బృందం పర్యటించి విచారణ చేపట్టారు