మెదక్: యూరియా కోసం రోడెక్కిన అన్నదాతలు
Medak, Medak | Sep 15, 2025 యూరియా కోసం రోడెక్కిన అన్నదాతలు మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో సోమవారం ఉదయం యూరియా కోసం రైతులు రోడ్ ఎక్కారు. గత నెల రోజులుగా యూరియా లెక ఇబ్బంది పడుతున్నామని, సోమవారం యూరియా బస్తాల కోసం ఉదయం నాలుగు గంటల నుండి పిఎసిఎస్ కార్యాలయం వద్ద రైతులు బారులు తీరారు. చెప్పులు క్యూ లైన్ లో పెట్టి యూరియా కోసం ఎదురుచూశారు. అధికారులు వచ్చి ఈరోజు యూరియా రాదని చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. దింతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. తమకు సరిపడా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లక్షల రూపాయలు పెట్టి నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.