పోచంపల్లి: జూలూరులో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి
పోచంపల్లి మండలం జూలూరు గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు మూటపురం అండాలు ఇంటి నిర్మాణానికి సోమవారం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదోడి సొంతింటి కల కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సహకారం అవుతుందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని తెలిపారు.