ఆలేరు: నిజాం నిరంకుశ పాలన నుంచి 1948 సెప్టెంబర్ 17న తెలంగాణకు విముక్తి కలిగింది:మాజీ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్ రెడ్డి
Alair, Yadadri | Sep 16, 2025 యాదాద్రి భువనగిరి జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం ఓటు రాజకీయం మానుకొని తెలంగాణకు స్వతంత్రం ఏ విధంగా వచ్చిందో గుర్తు చేసుకోవాలని మాజీ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్ రెడ్డి మంగళవారం అన్నారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో రహదారి బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత సర్దార్ వల్లభాయ్ పటేల్ చెరువుతో భారత సైనిక బలగాల ముట్టడితో నిజం నిరంకుశ పాలన నుండి 1948 సెప్టెంబర్ 17న తెలంగాణకు విముక్తి కలిగిందని తెలిపారు. అప్పటికే ఎంతోమంది తెలంగాణ సాయుధ పోరాట వీరులు నిజం సంస్థానంపై యుద్ధాలు చేసి ప్రాణ త్యాగం చేశారన్నారు.