గిద్దలూరు: టెన్నిస్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచిన గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని క్లబ్ రోడ్ లో ఉన్న టెన్నిస్ కోర్టులో మంగళవారం ఎమ్మెల్యే అశోక్ రెడ్డి టెన్నిస్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. జిల్లాస్థాయి టెన్నిస్ పోటీలను నిర్వాహకులు నిర్వహిస్తుండగా ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి క్రీడా పోటీలు ప్రారంభించి అనంతరం క్రీడాకారులతో కాసేపు సరదాగా టెన్నిస్ ఆడారు. క్రీడాకారులు గెలుపు ఓటములను సమానంగా తీసుకొని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగాలని వారికి సూచనలు సలహాలు ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు.