ఆదోని: ప్రైవేట్ మెడికల్ కళాశాలను వ్యతిరేకించండి : మెడికల్ కళాశాల సాధన కమిటీ
Adoni, Kurnool | Oct 7, 2025 ఆదోని మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఈనెల 10 న ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు జరగబోయే ధర్నాను జయప్రదం చేయాలని, మంగళవారం స్థానిక నోబెల్ కళాశాల ముందు ఆదోని మెడికల్ కళాశాల సాధన కమిటీ ఆధ్వర్యంలో కరపత్రాలు విడుదల చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ పి పి విధానాన్ని వ్యతిరేకించాలన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయకూడదని మెడికల్ కళాశాల సాధన కమిటీ కన్వీనర్ శ్రీనివాసులు తెలిపారు.