పాణ్యం: ఓర్వకల్లు మండలంలో రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ శంకుస్థాపన
ఓర్వకల్లు మండలం బ్రాహ్మణపల్లె గ్రామంలో రూ.3000 కోట్ల పెట్టుబడులతో “రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్” శంకుస్థాపన కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ గారితో కలిసి పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి, సంబంధిత శాఖల అధికారులు, రిలయన్స్ యాజమాన్యం, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు హాజరయ్యారు.