పత్తికొండ: పత్తికొండకు చెందిన వీరేష్ అనే వ్యక్తి రైలు నుంచి జారిపడి తీవ్ర గాయాలు
పత్తికొండకు చెందిన వీరేశ్ గుత్తి రైల్వే స్టేషన్లో కదులుతున్న రైలు నుంచి జారి కింద పడ్డాడు. మంగళవారం తెల్లవారుజామున కర్నూల్ నుంచి స్వగ్రామానికి బయలుదేరి గుత్తిలో దిగుతుండగా తెల్లవారుజామున ఘటన చోటు చేసుకుంది. గాయపడ్డ వీరేశ్ ను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.