బొద్దాంలో రోడ్డు నిర్మాణానికి నిధులు కేటాయించాలని వినూత్న రీతిలో నిరసన తెలిపిన 4 గ్రామాల ప్రజలు #localissue
Vizianagaram Urban, Vizianagaram | Jun 15, 2025
వేపాడు మండలం బొద్దాం గ్రామం నుంచి కళ్ళెంపూడి రహదారి వరకు రోడ్డు నిర్మాణానికి నిధులు ప్రభుత్వం వెంటనే కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం మధ్యాహ్నం బొద్దాం గ్రామంలో 4 గ్రామాల ప్రజలు వినూత్న రీతిలో తమ నిరసనను తెలియజేశారు. ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చల్లా జగన్ ఆధ్వర్యంలో గ్రామస్తులు గ్రామంలోని రోడ్డు మధ్యలో ఏర్పడిన అతిపెద్ద గోతి వద్ద చేరిన నీటిలో కూర్చొని పలు నినాదాలు చేస్తూ ఆందోళన జరిపారు. నెల రోజుల్లోగా రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించుకుంటే బొద్దాం నడిబొడ్డున నిరాహార దీక్షకు గ్రామస్తులతో దిగుతామని ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చల్లా జగన్ హెచ్చరించారు.