తార్నాక నుంచి ఉప్పల్ వెళ్లే రహదారిలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉప్పల్ వెళ్లేందుకు సుమారు 35 నిమిషాలు పడుతోందని వాహనదారులు తెలిపారు. రహదారి ఇరువైపులా మెట్రో పార్కింగ్ వాహనాలను నిలపడంతో మార్గం మరింత ఎరుకుగా మారిందని వాపోయారు. దీనికి తోడు రోడ్డుకు ఇరువైపులా స్వీట్ వ్యాపారులు స్టాళ్లు ఏర్పాటు చేసి సామాగ్రి వికరించడంతో సమస్య మరింత జఠలం అవుతుందన్నారు.