మార్కాపురం: భారత ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు వేడుకలు నిర్వహించిన బిజెపి అసెంబ్లీ కన్వీనర్ కృష్ణారావు
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని గడియారం స్తంభం సెంటర్ వద్ద బిజెపి అసెంబ్లీ కన్వీనర్ కృష్ణారావు ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణ అధ్యక్షులు ఆంజనేయులు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ పరిపాలన దేశంలో నెంబర్ వన్ గా ఉందని అన్నారు. ప్రపంచ దేశాలలో భారతదేశం ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందన్నారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.