పూతలపట్టు: మొగిలి వద్ద అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టిన కంటైనర్ వాహనం డ్రైవర్ కు గాయాలు.
బెంగళూరు వైపు నుండి చెన్నై వెళ్తున్న కంటైనర్ అదుపుతప్పి అతివేగం కారణంగా డివైడర్ను ఢీకొని డ్రైవర్ కు గాయాలైన సంఘటన శుక్రవారం ఉదయం 4 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం వరకు చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజవర్గం బంగారు పాల్యం మండల పరిధిలోని మొగిలి జంక్షన్ దాటుకుని వస్తున్న వాహనం డివైడర్ ను ఢీకొని డ్రైవర్ కు గాయాలు కావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు 108 వాహనం ద్వారా గాయపడిన వ్యక్తిని బంగారుపాళ్యం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.