మహదేవ్పూర్: మహాముత్తారంలో ట్రాన్స్ఫార్మర్ దొంగల ముఠా అరెస్ట్ వివరాలు వెల్లడించిన కాటారం డిఎస్పి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహ ముత్తారం మండలంలో పలు మండలాల్లో ట్రాన్స్ఫార్మర్లు పగులగొట్టి కాపర్ వైర్ చోరీ చేస్తున్న దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు మహా ముత్తారం పోలీసులు తెలిపారు. కాటారం డిఎస్పి సూర్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. మండలంలో వరుసగా దొంగతనాలు జరుగుతున్నాయని ఉద్దేశంతో మహాముత్తారం ఎస్సై మహేందర్ కుమార్ తన సిబ్బందితో గస్తీ నిర్వహిస్తుండగా తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఒక ఆటోల నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. యామనపల్లి వద్ద పట్టుకొని విచారించగా గత సంవత్సర కాలంగా ఒక ముఠాగా ఏర్పడి చుట్టుపక్కల గ్రామాలలో పగటి పూట రెక్కీ నిర్వహించి రాత్రి దొంగతనాలకు పాల్పడుత