నిర్మల్: వేతనాలు చెల్లించాలంటూ నిర్మల్ మున్సిపల్ కార్మికుల నిరసన
Nirmal, Nirmal | Sep 15, 2025 మున్సిపల్ కార్మికులకు గత రెండు నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే అందించాలని కోరుతూ మున్సిపల్ కార్మికులు సోమవారం కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. గత రెండు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. వేతనాలను వెంటనే చెల్లించాలని లేనిచో విధులను బహిష్కరిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు తదితరులున్నారు.