మంత్రాలయం: ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించి పర్యావరణాన్ని రక్షించుకుందాం: మంత్రాలయం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్
మంత్రాలయం:ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించి పర్యావరణాన్ని రక్షించుకుందామని మంత్రాలయం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య అన్నారు. శనివారం మంత్రాలయం మండల కేంద్రం పంచాయతీ కార్యాలయం నుంచి రాఘవేంద్ర కూడలి వరకు ఆయన పంచాయతీ కార్యదర్శి ఉపేంద్ర రెడ్డి, సచివాలయ సిబ్బందితో కలిసి స్వర్ణాంధ్ర -స్వచ్ఛ ఆంధ్ర ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్ వాడకం ద్వారా జరిగే అనర్థాలను పంచాయతీ కార్యదర్శి ప్రజలకు వివరించారు.