భూపాలపల్లి: ఢిల్లీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏబీవీపీ గెలుపు పట్ల చిట్యాల మండల కేంద్రంలో ఏబీవీపీ శ్రేణుల సంబరాలు
చిట్యాలమండల కేంద్రంలో ఏబీవీపీ నగర కార్యదర్శి ముష్కే అజయ్ ఆధ్వర్యంలో నాయకులు సంబరాలు చేశారు. ఢిల్లీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏబీవీపీ నాయకుల గెలుపును పురస్కరించుకొని ఆదివారం మండల కేంద్రంలో బాణాసంచా పేల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమానికి హాస్టల్స్ కన్వీనర్ వేల్పుల రాజ్ కుమార్ హాజరై మాట్లాడుతూ దేశంలో కమ్యూనిస్టుల కులతత్వ సంఘాలకు స్థానం లేదని అన్నారు. విద్యార్థులు జాతీయవాదం వైపు నడుస్తున్నారనే విషయం విద్యార్థి సంఘాల ఎన్నికల్లో తేలిపోయిందని స్పష్టం చేశారు. విద్యార్థుల సమస్యలపై ఏబీవీపీ నిరంతరం కృషి