అసిఫాబాద్: అటవీ ప్రాంతాల్లో విద్యుత్ లైన్లు ఉండొద్దు: ఆసిఫాబాద్ DFO నీరజ్ కుమార్
వన్యప్రాణుల సంరక్షణ కోసం అటవీ ప్రాంతంలో విద్యుత్ లైన్లు ఉండకుండా చర్యలు తీసుకోవాలని DFO నీరజ్ కుమార్ అన్నారు. గురువారం ASF జిల్లా కేంద్రంలో గురువారం జిల్లా ఎస్పీతో పాటు విద్యుత్ శాఖ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనుమతులు లేకుండా అటవీ ప్రాంతంలో విద్యుత్ వైర్లు అమర్చొద్దన్నారు. రిజర్వ్ ఫారెస్టులోని విద్యుత్ లైన్లను తొలగించి రెవెన్యూ భూముల నుంచి వేయడానికి చర్యలు చేపట్టాలన్నారు.