పాణ్యం: కల్లూరు అర్బన్ పరిధిలో వీకర్ సెక్షన్ కాలనీలో ఘనంగా నవరాత్రి,ఉత్సవాలు
కల్లూరు అర్బన్ పరిధిలోని వీకర్ సెక్షన్ కాలనీలో మంగళవారం మాత అంభా భవాని దేవాలయంలో దసరా నవరాత్రుల సందర్భంగా సోమవంశ సహస్రార్జున ఖత్రి సమాజ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా ఏపీ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ కమ్మరి పార్వతమ్మ, క్లస్టర్ ఇన్చార్జి జనార్ధన్ ఆచారి, వార్డు ఇన్చార్జి సుతారు రాఘవేంద్ర పాల్గొన్నారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు.