కొండపి: ఢిల్లీలో పేలుళ్లు చోటు చేసుకున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఎస్పి హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో పోలీసులు ముమ్మర తనిఖీలు
ప్రకాశం జిల్లావ్యాప్తంగా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో పోలీసులు సోమవారం ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఢిల్లీలో పేలుళ్లు చోటుచేసుకుని పలువురు మృతి చెందిన నేపథ్యంలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు జిల్లాలో హైలెట్ ప్రకటిస్తూ పోలీసులను ముమ్మర తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. పోలీసు అధికారులు వాహనాలను తనిఖీ చేయడంతో పాటు అనుమానత వ్యక్తులను ప్రశ్నిస్తూ తనిఖీలు చేస్తున్నారు.