శ్రీకాకుళం: శ్రీకాకుళం యాసలో కన్యాకుమారి రైతుకు ప్రాధాన్యం ఇచ్చే చిత్రాన్ని ఆదరించినందుకు కృతజ్ఞతలు తెలిపిన డైరెక్టర్ సృజన్ అట్టాడ
శ్రీకాకుళం యాసలో గ్రామీణ నేపథ్యంలో రూపొందించిన కన్యాకుమారి అనే ఓ రైతు చిత్రాన్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి చిత్ర దర్శకుడు సృజన్ అట్టాడ కృతజ్ఞతలు తెలిపారు.. బుధవారం సాయంత్రం శ్రీకాకుళంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పూర్తిగా శ్రీకాకుళం వ్యవహారిక యాసలో రైతును ప్రమోట్ చేస్తూ ఈ చిత్రాన్ని రూపొందించమని పలువురు సన్నివేశాలపై ప్రశంసలు కురిపించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు..