భూపాలపల్లి: సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో విద్యకు పెద్దపీట వేస్తున్నాం : ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
గణపురం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో భూపాలపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గూటోజు కిష్టయ్య వారి మొదటి నెల వేతనం నుండి వంద మంది విద్యార్థులకు యూనిఫాం పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... విద్యార్థులు సమానత్వంతో విద్యను అభ్యసించేలా ప్రజా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని తెలిపారు.