కోదాడ: కోదాడలో 5 బస్తాల గంజాయి పట్టివేత
Kodad, Suryapet | Sep 23, 2025 కోదాడ పట్టణ బైపాస్ రోడ్డులోని ఓ పెట్రోల్ బంక్ వద్ద పోలీసులు సుమారు 5 బస్తాల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన పట్టణంలో తీవ్ర కలకలం సృష్టించింది. గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న గంజాయి రవాణాను పోలీసులు చాకచక్యంగా అడ్డుకున్నారు. గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది, ఈ ముఠా వెనుక ఎవరు ఉన్నారనే విషయాలపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.