కుప్పం: కుప్పం : 19వ వార్డులో రేషన్ షాపు మంజూరు చేయాలని వినతి.
కుప్పం ఎంపీడివో కార్యాలయంలో నూతన రేషన్ షాపు మంజూరు చేయాలని 19వ వార్డు కౌన్సిలర్ జిమ్ దాము ఆధ్వర్యంలో ప్రజలు కడ పీడీ వికాస్ మర్మత్ కు సోమవారం నాడు ఉదయం 11 గంటల ప్రాంతంలో వినతిపత్రం అందజేశారు. 19వ వార్డు ప్రజలు 21వ వార్డులో ఉన్న రేషన్ షాపులో సరుకులు తీసుకోవాలని, అక్కడ కార్డుల సంఖ్య అధికంగా ఉందని పీడీ కి వివరించారు. రేషన్ షాప్ మంజూరుకు కృషి చేస్తామని వికాస్ మర్మత్ హామీ ఇచ్చారు.