కుప్పం: కుప్పం : మాజీ మంత్రి పెద్దిరెడ్డి మరియు ఎంపీ మిధున్ రెడ్డిని కలిసిన కుప్పం వైసీపీ నేతలు.
ఆదివారం నాడు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో తిరుపతిలో మాజీమంత్రి పెద్దిరెడ్డి మరియు ఎంపీ మిధున్ రెడ్డిని కుప్పం వైసిపి నేతలు, మున్సిపల్ కౌన్సిలర్లు కలిశారు. వారితో మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుప్పం నియోజకవర్గం రాజకీయ పరిణామాల గురించి కాసేపు చర్చించారు. తమకు పార్టీ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చినట్లు మున్సిపల్ వైస్ చైర్మన్ హఫీజ్ స్పష్టం చేశారు.