యాడికి మండలం రాయలచెరువు లో శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోను ఐచర్ వాహనం వేగంగా ఢీ కొనింది. ప్రమాదంలో ఆటో డ్రైవర్ విశ్వనాథ్ తీవ్రంగా గాయపడ్డాడు. యాడికి మండలం నగురూరుకు చెందిన విశ్వనాద్ ఆటో ను డ్రైవ్ చేసుకుంటూ రాయల చెరువు బయలుదేరాడు. ఆటో రాయల చెరువులోకి వెళ్లిన సమయంలో ఐచర్ వాహనం వేగంగా వచ్చి ఢీ కొనింది. విశ్వనాధ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆటో ముందర భాగం నుజ్జు నుజ్జు అయింది. ఈ సంఘటనపై సీఐ శ్రీనివాసులు కేసు దర్యాప్తు చేపట్టారు.