కోడుమూరు: తిమ్మాపురం చెరువులో చేప పిల్లలను నీటిలో వదిలిన ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి
గూడూరు మండలంలోని తిమ్మాపురం చెరువులో మంగళవారం 15 లక్షల చేప పిల్లలను నీటిలో వదిలే కార్యక్రమంలో ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మత్స్యకారులకు రక్షణ కవచంగా పథకాలు అమలు చేస్తుందన్నారు. మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు పథకాలు దోహదపడుతున్నాయని తెలిపారు. అనంతరం బెలగల్ మత్స్యకారులకు పిఎం ఎం ఎస్ వై పథకం కింద రూ. 2.54 లక్షల విలువైన చెక్కును ఎమ్మెల్యే అందించారు.