యాడికి మండలం రాయలచెరువు గ్రామంలో సీఐ శ్రీనివాసులు శనివారం పోలీస్ సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా తాడిపత్రి పెన్నా నది నుంచి నల్ల మేకలపల్లికి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ట్రాక్టర్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. ట్రాక్టర్ ను సీజ్ చేశారు. ఈ సంఘటనపై సీఐ శ్రీనివాసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.