రాయదుర్గం: కళ్యం గ్రామంలో టిడిపి, వైసీపీ సానుభూతి పరుల మద్య జరిగిన ఘర్షణలో ఇరువర్గాలకు చెందిన 11 మందికి గాయాలు ఆసుపత్రిలో చేరిక
డి.హిరేహాల్ మండలంలోని కళ్యం గ్రామంలో ఇరువర్గాల మద్య జరిగిన ఘర్షణలో ఇరువర్గాలకు చెందిన 11 మంది రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జనవరి నెలలో జరగనున్న ఆంజనేయస్వామి ఉత్సవాల నేపథ్యంలో బైలాట నిర్వహించేందుకు బుధవారం రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో టిడిపి, వైసీపీ సానుభూతి పరుల మద్య మాటామాటా పెరిగి ఘర్షణ కు తావుతీసింది. ఈ ఘర్షణలో వైసిపి సానుభూతి పరులు మంజునాథ, పెన్నయ్య, తిప్పేరుద్ర, శివ, చౌడేష్, వన్నూరస్వామి గాయపడ్డారు. వీరిని రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం వైద్యులు సిఫార్సు చేశారు.