పొదలకూరులో మద్యం తెల్లవారు జాము నుంచే మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు. మామూళ్లకు అలవాటు పడ్డ అధికారులు, పట్టించుకోవడం లేదని.. ఆరోపణలు వినిపిస్తున్నాయి. త్రాగునీళ్లు దొరకని గ్రామాలు ఉన్నాయో లేవో తెలియదు కానీ బెల్టు మద్యం లేని గ్రామం లేదంటే అతిశయోక్తి కాదన్న ప్రచారం జరుగుతుంది. బెల్టు దుకాణాలు ఏర్పాటు చేసి ఇలా అధిక ధరలకు మద్యాన్ని అమ్ముకుంటున్నారు.