గిద్దలూరు: గిద్దలూరు మండలం దిగువమెట్ట వన విహారిలో నిర్వహించిన వన మహోత్సవ సమారాధన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దిగువ మెట్ట వనవిహారి పార్కులో ఆదివారం నిర్వహించిన వన మహోత్సవ సమారాధన కార్యక్రమంలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గతంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా కాలిపోయిన అతిథి గృహాలను తిరిగి ప్రారంభించారు. పార్కును సందర్శించిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అభివృద్ధిపై అటవీశాఖ అధికారులతో మాట్లాడారు. తర్వాత అడవులను సంరక్షించుకోవడం మనందరి బాధ్యత అని వాటి వల్ల మనకు లభిస్తున్న ఆక్సిజనే ముఖ్య కారణమని తెలిపారు. తర్వాత వనభోజనాలలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.