పత్తికొండ: వెల్దుర్తి మండలానికి చెందిన వ్యక్తిపై కిడ్నాప్ కేసు నమోదు చేసిన కర్నూలు పోలీసులు
నాలుగేళ్ల పాపను ఎత్తుకెళ్లిన నిందితుడిని అరెస్టు చేసినట్లు కర్నూల్ నాలుగో పట్టణ సీ.ఐ విక్రమ్ సింహ తెలిపారు. వెల్దుర్తి(M) బుక్కాపురానికి చెందిన మధు(22) సోమవారం పాపతో హైదరాబాద్కు వెళ్తుండగా ఎస్సై చంద్రశేఖర్ రెడ్డి పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద పట్టుకున్నారు. అనంతరం చిన్నారిని తల్లికి అప్పగించారు. కిడ్నాప్ కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు.