సంకేపల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వృద్ధుడు నగరంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
Anantapur Urban, Anantapur | Sep 17, 2025
శ్రీ సత్య సాయి పుట్టపర్తి జిల్లాలోని ముదిగుబ్బ మండలం సంకేపల్లి వద్ద జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో పొడరాళ్లపల్లి గ్రామానికి చెందిన నారాయణస్వామి అనే వృద్ధుడు నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. బుధవారం ఉదయం సంకేపల్లి వద్ద జాతీయ రహదారిపై కుక్కర్టు రావడంతో ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతనిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు.