వివేకానంద జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థి ఆత్మహత్యయత్నం
Anantapur Urban, Anantapur | Sep 14, 2025
అనంతపురం నగర శివారులోని వివేకానంద జూనియర్ కళాశాలలో ఆదివారం రాత్రి 9:30 గంటల సమయంలో ఇంటర్మీడియట్ విద్యార్థి సాయి చరణ్ రెడ్డి హాస్టల్లో ఉండడం ఇష్టం లేక అధిక మొత్తంలో మాత్రలు వేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే గమనించిన స్నేహితులు హాస్టల్ వార్డెన్లు హుటాహుటిన మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తీసుకువచ్చారు. సాయి చరణ్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉన్నదని అత్యవసర విభాగం వైద్యులు డాక్టర్ కార్తీక్ రెడ్డి తెలిపారు.ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.