కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం అందించాలి: సుంకరవారితోటలో జిల్లా కార్యదర్శి శ్రీనివాస్
Eluru Urban, Eluru | Sep 21, 2025
కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం అందించాలని, ధాన్యం క్వింటాల్ కు రాష్ట్ర ప్రభుత్వం రూ. 500 బోనస్ ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సుంకర వారి తోట కనకదుర్గమ్మ గుడి వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు మండల మహాసభ తలారి జయరాజు అధ్యక్షతన నిర్వహించారు. మండలంలోని పలు రైతుల సమస్యలు చర్చించి తీర్మానాలు ఆమోదించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన కె.శ్రీనివాస్ మాట్లాడుతూ వ్యవసాయంలో కష్టపడుతున్న, అప్పులు చేసి పెట్టుబడులు పెడుతున్న కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం అందించకపోవడం అన్యాయమని విమర్శించారు