గొల్లప్రోలు జంట హత్యలకు కారణం ఆర్థిక లావాదేవీలే పిఠాపురం సిఐ శ్రీనివాస్
తాటిపర్తిలో జరిగిన జంట హత్యలకు ఆర్థిక లావాదేవీలే కారణమని పిఠాపురం సీఐ శ్రీనివాస్ తెలిపారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామంలో హత్యలకుసంబంధించి పిఠాపురం సీఐ శ్రీనివాస్ ఆదివారం సాయంత్రం 6 గంటలకు మీడియాకు తెలిపిన వివరాలు.సెప్టెంబర్ 16న రాత్రి సమయంలో నిందితుడు గంగాధర్, సూరిబాబు, శ్రీనివాస్లకు పార్టీ ఇస్తానని చెప్పి గ్రామ శివారుకు తీసుకెళ్లి బావిలోకి తోసి హత్య చేశాడు. మరో వ్యక్తి కుంపట్ల సూరిబాబును గొల్లప్రోలు కాలువ వద్దకు తీసుకువెళ్లి హత్య చేసేందుకు ప్రయత్నించగా, అతను తప్పించుకున్నాడని వెల్లడించారు.