నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో చట్టవిరుద్ధంగా సైలెన్సర్లు మార్చిన 34 మోటార్ సైకిళ్లపై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. సోమవారం అధిక శబ్దంతో ప్రజలను ఇబ్బంది పెడుతున్న వాహనాల సైలెన్సర్లను సీఐ ఇంతియాజ్ బాషా సిబ్బందితో కలిసి ధ్వంసం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలను సీజ్ చేస్తామని డీఎస్పీ హెచ్చరించారు. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో పట్టణంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.