కళ్యాణదుర్గం: బోరంపల్లి గ్రామంలో దారుణం, భార్యను కత్తితో గొంతు కోసి హత్య చేయడానికి ప్రయత్నించిన భర్త
కళ్యాణదుర్గం మండలం బోరంపల్లి గ్రామంలో బుధవారం దారుణం చోటుచేసుకుంది. రత్నమ్మ అనే మహిళను భర్త ఎర్రి స్వామి కత్తితో గొంతు కోసి హత్య చేయడానికి ప్రయత్నించాడు. అయితే చావు బతుకుల్లో ఉన్న రత్నమ్మను వెంటనే కళ్యాణ దుర్గం ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కొరకు అనంతపురం రెఫర్ చేశారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ దారుణం చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.